'అధికారికంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి'

'అధికారికంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి'

సత్యసాయి: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి సవిత తెలిపారు. గురువారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 16న ఆయన జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు గౌతు లచ్చన్న అని మంత్రి కొనియాడారు.