VIDEO: చివరి కార్తీక సోమవారం.. పూలకు పెరిగిన డిమాండ్
కృష్ణా: నేడు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో జిల్లాలో శివాలయాలకు భక్తులు భారీగా తరలివెళ్లనున్నారు. ఈ క్రమంలో పూజలకు అవసరమైన చామంతి పూలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. సాధరణంగా రూ. 80-100 ఉన్న చామంతి ధరలు కొన్నిచోట్ల రూ. 200 నుంచి రూ. 250 వరకు పెరిగాయి. అయితే ధరలు పెరిగినా.. భక్తులు మాత్రం కొనుగోలుకు ఏమాత్రం వెనుకాడకపోవడం గమనార్హం.