కొండవీటి అందాలు.. డ్రోన్ వీడియో
గుంటూరు జిల్లా కొండవీడు కోట పచ్చని వనంతో కొత్త శోభను సంతరించుకుంది. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఘాట్ రోడ్డు దృశ్యాలు చూపరులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. మెలికలు తిరుగుతున్న ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. పర్యాటకులు ఈ అందాలను వీక్షించడానికి ఎక్కువగా వస్తున్నారు.