ఆరుగురు పేకాట రాయలు అరెస్ట్
SRPT: నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై నాగారం పోలీసులు నిఘా ఉంచారు. నమ్మదగిన సమాచారంపై నాగారం ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో పోలీస్ టీం ఫణిగిరి గట్టు పరిసరాల్లో ఇవాళ ఆకస్మిక సోదాలు నిర్వహించి ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి నుంచి రూ. 24,400 రూపాయల నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.