ఘోరం.. లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి

ఘోరం.. లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి

AP: అన్నమయ్య(D) రాజంపేట(M) బోయినపల్లిలో ఘోరం జరిగింది. ప్రియా లేడీస్ హాస్టల్ యజమాని గిరిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గిరి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. స్థానిక హాస్టళ్ల మధ్య ఉన్న పాత విభేదాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై ఇంకా సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.