రక్త సంబంధాన్ని చాటుకున్న మహిళ కండక్టర్లు

MBNR: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే విధి నిర్వహణపట్ల అంకితభావం ప్రదర్శిస్తూనే రక్త సంబంధాన్ని వ్యక్తపరిచారు. ఈ దృశ్యం జిల్లా ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం కనిపించింది. డ్యూటీ ఉండడంతో రాఖీ పండగ సందర్భంగా సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లడానికి మహిళ కండక్టర్లకు వీలుపడలేదు. దీంతో తమ తమ సోదరులను బస్టాండ్‌కు పిలిపించుకుని రాఖీలు కట్టి రక్త సంబంధాన్ని చాటుకున్నారు.