రైలు కిందపడి..విద్యార్థి మృతి

SKLM: ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం కదులుతున్న రైలు కింద పడి పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సంతకవిటిలోని మందరాడకు చెందిన దేవుళ్ల హేమంత్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.