పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

ELR: ముసునూరు మండలం అన్నపనేని వారి గూడెం గ్రామానికి చెందిన దుక్కిపాటి నాగరాజు(48) పురుగుల మందు తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురికాగా స్థానికులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగరాజు సోమవారం మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. నాగరాజుకు భార్యతో గొడవలు కావడంతో పురుగుల మందు తాగినట్లు బంధువులు పేర్కొన్నారు.