అప్పుల భారాన్ని తట్టుకోలేక రైతు ఆత్మహత్య
KRNL: నందవరం మండలం జోహారాపురంలో రైతు శ్రీనివాస రెడ్డి (47) అప్పుల భారాన్ని తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసగా పంటలు నష్టపోవడం, అప్పులు పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.