కమ్ముకున్న పొగ మంచు.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

కమ్ముకున్న పొగ మంచు.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల నుంచి తుంగతుర్తికి వెళ్లే జాతీయ రహదారి 365పై దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. మంచు కారణంగా వాహన దారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తగు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు.