కేసముద్రంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

MHBD: కేసముద్రం మున్సిపాలిటీలో అంబేద్కర్ యువజన సంఘం టౌన్ అధ్యక్షుడు జల్లంపల్లి శ్రీను ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబేద్కర్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గీతాపాలన చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.