VIDEO: విద్యుత్ తీగలపై కొమ్మలు తొలగించాలని వినతి
WNP: పానగల్ మండలం కేతేపల్లి ఎస్సీ కాలనీలో విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా మారాయి. ఈదురు గాలుల సమయంలో తీగలు ఒకదానికొకటి తగిలి మంటలు వస్తున్నాయని, సరఫరాకు అంతరాయం కలుగుతోందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా ఉన్న కొమ్మలను తొలగించాలని వారు కోరుతున్నారు.