బ్రేక్‌ఫాస్ట్‌లో ఏ ఆహారాలు తింటే మంచిది?

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారాలను తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, రాగులు, జొన్నలు వంటి చిరు ధాన్యాలతో చేసిన టిఫిన్లు, పోహా, పప్పు దినుసులతో తయారు చేసే ఇడ్లీ లేదా దోశ వంటివి, కినోవా వంటి ఆహారాలను తింటే మంచిది. ఇవి శరీరానికి శక్తిని, పోషణను అందిస్తాయి. శరీరం రోజంతా యాక్టీవ్‌గా ఉంటుంది.