'మన జీవన విధానం ద్వారానే మధుమేహ వ్యాధి వస్తుంది'
KNR: మన జీవన విధానం ద్వారానే మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ మధుమేహ నివారణ దినోత్సవం సందర్భంగా ధర్మపురిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇన్సులిన్ పని చేయని కారణంగా మధుమేహం వస్తుందన్నారు. మధుమేహం రావడానికి గల కారణాలు, నివారణ మార్గాల గురించి వివరించారు.