ఐదవ వార్డులో అభివృద్ధి పనులకు భూమిపూజ

ఐదవ వార్డులో అభివృద్ధి పనులకు భూమిపూజ

VSP: మధురవాడలోని సాయిరాం, డ్రైవర్స్ కాలనీలలో రూ.12 లక్షల వ్యయంతో రోడ్లు, కాలువలు నిర్మించనున్నారు. ఈ పనులకు 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వార్డులో అభివృద్ధి వేగంగా సాగుతోందని తెలిపారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచనలతో వార్డు అభివృద్ధి చెందుతుందని అన్నారు.