'పవిత్ర రంజాన్ మత సామరస్యానికి ప్రతీక'
JGL: పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకుని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలో ఈద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి నీళ్ల బావి ఈద్గా వద్ద, ఖిల్లా జగిత్యాలలో ముస్లిం మైనార్టీ సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలపారు. ఆయన మాట్లాడుతూ.. ముస్లింల పవిత్ర మాసంలో జరుపుకునే రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.