VIDEO: తిమ్మప్ప స్వామి కళ్యాణం
GDWL: మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన తిమ్మప్ప స్వామి కళ్యాణం బుధవారం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని, శ్రీదేవి భూదేవి సమేత తిమ్మప్ప స్వామికి ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య ముత్యాల తలంబ్రాలు పోసి కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.