తుఫాను హెచ్చరికతో రైతుల్లో ఆందోళన
W.G: ద్విత్వా తుఫాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు నేపథ్యంలో రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తణుకు నియోజవర్గంలో 40,872 ఎకరాల్లో వరి సాగు చేయగా ఆదివారం సాయంత్రానికి 18,187 ఎకరాల్లో వరి కోతలు పూర్తి చేశారు. 34 రైతు సేవా కేంద్రాల ద్వారా 29,350 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.