సంగారెడ్డి వరకు మెట్రో.. అసెంబ్లీలో ప్రస్తావన
TG: మెట్రో రైలు సేవలను సంగారెడ్డి వరకు విస్తరించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తామని ముఖ్యమంత్రి గతంలో చేసిన ప్రకటనను గుర్తుచేస్తూ, పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు మెట్రో సేవలను విస్తరించాలని తెలిపారు.