రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు
సత్యసాయి: 35వ సబ్-జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ధర్మవరం నుంచి 8 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ హరీష్ బాబు క్రీడాకారులను, కోచ్ పృథ్విని శాలువాలతో సత్కరించారు. ధర్మవరం యువత క్రీడల్లో రాణించడం గర్వకారణమని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ అన్ని రకాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.