జర్నలిస్టులకు కనీస వేతనాలు ఇవ్వాలి: ఎమ్మెల్యే
NTR: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ ప్లీనరీ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి మూల స్తంభాలుగా ఉన్న జర్నలిస్టులకు కనీస వేతనాలు అందించేలా నూతనంగా ఎన్నికైన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు.