VIDEO: మహిళలకు చీరల పంపిణీ చేసిన కిరణ్ రాయల్

TPT: పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గ పిఠాపురంలో 10వేల మందికి చీరలు పంపిణీ చేసినట్లు జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. తమ అధినేత స్ఫూర్తితో తిరుపతిలోని అంకాలమ్మ దేవస్థానంలో చీరలు పంచామన్నారు. ఈ మేరకు పారిశుద్ధ కార్మికులతో పాటు మహిళలకు పసుపు, కుంకుమ, పండ్లు, చీరచ, జాకెట్లు అందజేసినట్లు చెప్పారు. అనంతరం వాళ్ల అందరితో కలిసి జనసేన నాయకులు సహపంక్తి భోజనం చేసారు.