కార్మికులకు వేతనం చెల్లించాలని వినతిపత్రం అందజేత
VZM: కొత్తవలస మండలం అప్పన్నపాలెంలో ఉన్న జిందాల్ పరిశ్రమ మూతపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం విజయనగరంలో జరిగిన పీజీఆర్ఎస్‌లో టీఎన్‌టీయూసీ అధ్యక్షులు లెంక శ్రీను కలెక్టర్‌కి కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ వెంటనే స్పందించి కార్మికులకు వేతనం చెల్లించేలా ఏర్పాటు చేయాలని డీసీఎల్‌ని ఆదేశించారు.