అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

KDP: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మైలవరం మండలంలో జరిగింది. జమ్మలమడుగు-తాడిపత్రి బైపాస్ రోడ్డు పక్కన ముళ్లపొదలలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు దన్నవాడకు చెందిన పులిచెర్ల పెద్ద పాపిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. పంట దిగుబడి రాక అప్పులు ఎక్కువై, ఆనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.