జిల్లాకు మూడు రోజులు వర్ష సూచన

జిల్లాకు మూడు రోజులు వర్ష సూచన

శ్రీకాకుళం: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 27, 28, 29 తేదీలలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు తీరం వెంబడి 40-50 కి.మీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని పేర్కొంది. అత్యధికంగా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది.