అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్త దానం
WNP: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నిన్న సాయంత్రం రక్తదాన శిబిరం నిర్వహించారు. సాహితీ కళా వేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్ పాల్గొని, 19వ సారి రక్తదానం చేసిన బండారు శ్రీనివాస్‌ను, ఇతర దాతలను అభినందించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధికారులు అరుణకుమారి, శివప్రసద్ తదితరులు పాల్గొన్నారు.