మంత్రి తుమ్మలను కలిసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు

మంత్రి తుమ్మలను కలిసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు

KMM: ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి సోమ నర్సింహారావు, ఉపాధ్యక్షుడు బత్తిన నర్సింహారావు, కోశాధికారి తల్లాడ రమేష్ గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ వారిని శాలువాతో సత్కరించారు. వ్యాపార వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.