'మధుమేహ నివారణకు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి'
GNTR: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో శుక్రవారం ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పల్లపాటి లింగరాజు మాట్లాడుతూ.. మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించుకోవాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం, ధ్యానం, యోగా వంటి సాధనలు చేయడం ఎంతో ముఖ్యం అన్నారు.