ఈ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కృష్ణా జిల్లాలో మంగళవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. జిల్లాలోని గన్నవరం 39.5, కంకిపాడు 39.2, పెనమలూరు 39.4, ఉంగుటూరు 39.4, ఉయ్యూరు 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది.