నూజివీడులో 'నీటి భద్రత–సాగునీటి సంఘాలు బాధ్యత'
ELR: నూజివీడులో పెద్ద చెరువు వద్ద 'నీటి భద్రత–సాగునీటి సంఘాలు బాధ్యత' కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు మట్టాన్ని పెంపొందించడం, నీటి వనరులు సంరక్షణ, సాగునీటి వ్యవస్థ బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.