VIDEO: నర్సీపట్నంలో డ్వాక్రా మహిళల నిరసన

VIDEO: నర్సీపట్నంలో డ్వాక్రా మహిళల నిరసన

AKP: నర్సీపట్నం ఆర్‌డీవో కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలు ఇవాళ నిరసన తెలియజేశారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులకు అభయ హస్తం పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ లోకవరపు రామారావుకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం కావాలని అభయ హస్తం పెన్షన్లను రద్దు చేసిందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వాలన్నారు.