సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన
NRML: వాసవి ఉన్నత పాఠశాల దగ్గర గల పార్కులో నిర్మల్ మున్సిపల్ కమీషనర్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ వాసవి విద్యార్థులకు సేంద్రీయ ఎరువుల తయారీ విధానాన్ని గురించి అవగాహన కల్పించారు. మన ఇంట్లో కుళ్ళి పోయిన పండ్లు కూరగాయలను, మన ఇంటి పరిసరాలలోని చెట్ల నుండి పడిన ఆకులతో సేంద్రీయ ఎరువులను తయారి గురించి విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.