అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అన్నమయ్య: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓబులవారిపల్లి మండలం పెద్ద ఓరంపాడు పంచాయతీ బెస్తపల్లి గ్రామంలో ఇవాళ సారా సురేష్ అనే రైతు వ్యవసాయంలో నష్టాలు, అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న అతన్ని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.