ఎమ్మెల్యే హరీష్‌కు మాజీ ఎమ్మెల్యే ఆహ్వానం
MDK: ఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో ఈనెల 30న మైలారం మల్లన్న స్వామి జాతర నిర్వహించనున్నారు. ఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వాహకులు ఇవాళ MLA హరీష్ రావును కలిసి జాతరకు ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, సురేష్ గౌడ్, మాజీ సర్పంచులు సిద్దు, కే. రాజు, రాజు, రిషి తదితరులు ఉన్నారు.