VIDEO: బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులు అరెస్ట్
కృష్ణా: ఉయ్యూరులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై సీఐ రామారావు గురువారం చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి సమయంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వ్యక్తులను సీఐ అదుపులోకి తీసుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలో అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.