ఆగస్టు 12న ఖమ్మంలో జాబ్ మేళా
KMM: నిరుద్యోగ యువత కోసం 12న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటీఐ, టేకులపల్లి) లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ఈ ఉద్యోగాలకు బీటెక్ బయో మెడికల్ అర్హత కలిగి, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.