'ఉపాధ్యాయులు శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి'
SRD: ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి విద్యాసాగర్ అన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం శనివారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.