VIDEO: కుందపల్లి వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే
ASR: పి. గన్నవరంలోని కుందలపల్లిలో MLA గిడ్డి సత్యనారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కుందపల్లిలోని మృతదేహం తరలింపు విషయంలో సామాజిక వర్గాల మధ్య తలెత్తిన వివాదాన్ని ఇరువర్గాలతో విడివిడిగా మాట్లాడి, బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ కులమత భేదాలు లేకుండా కలిసి ఉండాలన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదైందని ఎవరు ఆందోళన చెందొద్దన్నారు.