'కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'
BDK: సింగరేణి కార్మికులు వారి సమస్యలపై కొత్తగూడెం జీఎం ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మంగళవారం16 వ డివిజన్ కార్పొరేటర్ పద్మ, జిల్లా సీపీఐ కార్యదర్శి ఎస్ కే షాబీపాషా పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కార్మిక వాడలో నెలకొన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.