ఉగ్రలింకుల కేసు.. ముగిసిన నిందితుల విచారణ

ఉగ్రలింకుల కేసు.. ముగిసిన నిందితుల విచారణ

విజయవాడ ఉగ్ర లింకుల కేసులో ఐదుగురు నిందితుల ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. NIA, IB, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితులను జిహాదీ భావజాలం, సోషల్ మీడియా నెట్‌వర్క్, ఉగ్ర కుట్రల కోణంలో ప్రశ్నించారు. ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్ట్ కాగా, మొదటి విడతలో ఐదుగురిని విచారించారు. మిగిలిన నిందితుల కస్టడీ కోసం పోలీసులు న్యాయస్థానం అనుమతి కోరాల్సి ఉంది.