రాష్ట్రంలో ఒకలా.. మునుగోడులో మరోలా..

రాష్ట్రంలో ఒకలా.. మునుగోడులో మరోలా..

NLG: మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలు ఇకనుంచి మధ్యాహ్నం 1 గంటకు తరువాతే తెరుచుకోనున్నాయి. MLA కోమటిరెడ్డి రాజగోపాల్ టెండర్ల సమయంలో షరతులు విధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిబంధనలు ఎలా ఉన్నా, తన నియోజకవర్గంలో తాను పెట్టిన నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని అల్టీమేటం జారీ చేశారు. దీంతో వైన్ షాప్‌లో సాయంత్రం 6 తరువాతే పర్మిట్ రూంలోకి ప్రజలను యాజమానులు అనుమతించనున్నారు.