రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నంద్యాల: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో వెబ్ సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.