VIDEO: ఈద్గా మైదానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: ఈద్గా మైదానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

KMM: ముస్లింలు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన వైరా మున్సిపాలిటి పరిధిలోని రిజర్వాయర్ సమీపంలో ఉన్న ఈద్గా మైదానాన్ని పరిశీలించారు. రంజాన్ పర్వదినం నాటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈద్గా స్థలాన్ని సర్వసిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.