కార్మిక సంఘాల ఆగ్రహం.. నేడు దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’

కార్మిక సంఘాల ఆగ్రహం.. నేడు దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్‌లకు నిరసనగా కార్మిక సంఘాలు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ చట్టాలు కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఈరోజును ‘బ్లాక్ డే’గా పాటించాలని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమల వద్ద భారీ ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని సంఘాలు స్పష్టం చేశాయి.