పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
PLD: నరసరావుపేట బరంపేటలోని ఎస్‌బీఆర్ ఎంపీఎల్ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హాజరై చిన్నారుల ప్రతిభ, ఉపాధ్యాయుల అంకితభావాన్ని ఆయన అభినందించారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. పాఠశాల మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.