సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలి: మాజీ ఎంపీపీ

సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలి: మాజీ ఎంపీపీ

GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడి ఇంటికి చేరేలా కృషి చేస్తున్నామని గట్టు మాజీ ఎంపీపీ జె.విజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, గట్టు మండలం చాగదోన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అయన అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధి నా ధ్యేయమని పేర్కొన్నారు.