VIDEO: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఖాళీ.. ఉద్రిక్తత

VIDEO: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఖాళీ.. ఉద్రిక్తత

JN: పాలకుర్తి మండలం సిరిసన్నగూడెం గ్రామంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. తమను అన్యాయంగా బయటకు పంపుతున్నారని ఆరోపిస్తూ అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు.