పరుగు పందెంలో పోతరాజు అశోక్‌కు కాంస్య పతకం

పరుగు పందెంలో పోతరాజు అశోక్‌కు కాంస్య పతకం

HNK: ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా ఫైర్ సర్వీస్ కంట్రోల్ బోర్డు మీట్–2026లో 5 కిలోమీటర్ల పరుగుపందెం విభాగంలో బుధవారం పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన పోతరాజు అశోక్ కాంస్య పతకం సాధించారు. ప్రస్తుతం మట్టేవాడ ఫైర్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ విజయంతో యువతకు ప్రేరణగా నిలిచారని పలువురు అభినందించారు.