పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
GNTR: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌ను సౌత్ డీఎస్పీ భానోదయ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులు, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలను ఎస్సై నరహరిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే అర్జీదారులతో మర్యాదగా మసలుకోవాలని ఆమె సిబ్బందికి సూచించారు.