గ్రామ పంచాయతీ ప్రహరీ గోడను ప్రారంభించిన MLA
కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని పెద్దనాపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయ ప్రహరీ గోడను మంగళవారం ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. దీనిని 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించినట్లు ఎంపీపీ నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్థుల భద్రత దృష్ట్యా ఈ గోడను నిర్మించామని, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు.